కుల మతాల అతీతంగా పీర్ల పండుగ
కోదాడ,జూలై 14(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలో తమ్మర బండ పాలెం గ్రామంలో శనివారం రాత్రి జరిగిన పల్లె పల్లె నా పీర్ల పండుగ అను కార్యక్రమంలో భాగంగా భారీ వర్షం సైతం లెక్కచేయక వేలాది మంది భక్తులు హిందూ ముస్లిం సోదరులు మహిళా సోదరులు జరిగిన ఏడవ శరభత్ కార్యక్రమంలో పాల్గొని హలై దులై అంటూ డప్పు మేళాలు మధ్య అగ్నిగుండం చుట్టూ సింధులు వేస్తూ సాంబ్రాణి పొగలతో,రంగు రంగుల శారాయులతో,దట్టిలతో సైదాకు దండలతో చూడటానికి కొట్టొచ్చిన విధంగా అలంకరింపబడిన పీర్లను చూసి భక్తి పరవశంతో మునిగిపోయి ఎంతో సంతోషంగా ఈ పండుగను చేసుకున్నారు.అనంతరం స్థానికంగా ఉన్న ముజావర్లు మాట్లాడుతూ ఈ కార్యక్రమమునకు విచ్చేసిన హిందూ ముస్లిం మహిళా సోదరులకు,పిల్లలకు,పెద్దలకు ఆ భగవంతుని యొక్క దీవెనలు,ఆశీస్సులు మీపై మనపై గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని అని అన్నారు.