అనంతగిరిలో సంబురంగా గంగమ్మ జాతర
̊
̊ అనంతగిరి,జూలై 14(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:అనంతగిరి మండల కేంద్రంలో గంగమ్మ జాతరను సంబురంగా ఆదివారం నిర్వహించారు.ఈ సందర్భంగా బోనంఎత్తిన మహిళలు, చిన్నపిల్లలు కుటుంబ సభ్యులతో గంగమ్మ తల్లికి తమ మొక్కులు చెల్లించుకున్నారు.యువత సౌండ్ డాన్సులతో,సాంప్రదాయ నృత్యాలతో గ్రామంలో పండగ వాతావరణం

సంతరించుకుంది.సకాలంలో వర్షాలు కురిసి రైతులు,రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని గంగమ్మ తల్లి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో కతిమాల వెంకన్న కంటగాని శ్రీను,కే కృష్ణ,కారంగుల బాబు,యస్మిత,శ్రావణి,తేజశ్రీ,గ్రామ యాదవ పెద్దలు,కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.