ప్రజల ఆధారాభిమానాలతో నియోజకవర్గంలో ముందుకు వెళతా:బీజేపీ రాష్ట్ర నాయకులు డా,, అంజి యాదవ్
కోదాడ,జులై 14(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ప్రజల యొక్క ప్రేమనురాగాలు,ఆధారాభిమానాలతో కోదాడ నియోజకవర్గంలో ఉన్న ప్రధానమైన సమస్యలపై పోరాటం చేస్తూ ముందుకు వెళతానని బిజెపి రాష్ట్ర నాయకులు డా,, మల్లెబోయిన అంజి యాదవ్ అన్నారు.గత సంవత్సరం జులై 14న మన ఊరుకు మన గడపకు మన అంజన్న అనే కార్యక్రమాన్ని ప్రధాన ఎజెండాగా ఎంచుకొని నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఉన్న ప్రధానమైన సమస్యలపై గల మెత్తెందుకు నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర చేసి నేటికీ సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా అంజి యాదవ్ మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గంలో పాదయాత్ర సమయంలో ప్రజలు నన్ను ఎంతగానో ప్రేమించి ఆదరించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.గ్రామాలలో ప్రధాన సమస్యలపై సంబంధిత అధికారులతోటి,ప్రజా ప్రతినిధుల తోటి మాట్లాడి ఆ సమస్యలు త్వరగా పూర్తయ్యే విధంగా నా శాయశక్తుల కృషి చేశానని ఈ సందర్భంగా గుర్తు చేశారు.రాబోయే రోజులలో కోదాడ నియోజకవర్గం అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకం కావున యువత ముందుకు వచ్చి నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు.