అమ్మ మాట.. అంగన్వాడీ బాట
•అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య పెంచేందుకు స్పెషల్ డ్రైవ్
కోదాడ,జులై 16(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:అంగవ్వాడీ కేంద్రాల్లో పూర్వ
ప్రాథమిక విద్య అమలు చేస్తుండడంతో బడిబాటను మరోసారి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఇటీవల అంగన్వాడీ బడిబాటలో భాగంగా పలువురు చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల్లో చేరారు.మిగిలిన వారిని కూడా చేర్పించేందుకు మంగళవారం తమ్మర బండపాలెం లో అమ్మ మాట.. అంగన్ వాడీ బాట కార్యక్రమం చేపట్టినారు.

ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ వెంకటరమణ మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల అంగన్వాడీ కేం ద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను అమలు చేయాని నిర్ణయించింది.ఈ మేరకు అంగన్వాడీ టీచర్లకు పూర్వప్రాధమిక విద్య (ఈసీసీ)పై ప్రత్యేకంగా శిక్షణ అందించారు.శిక్షణ పొందిన మేము పిల్లలకు ఆటపాటలు,కథలతో పాటు,సంభాషణ నైపుణ్యాలు నేర్పిస్తున్నామని అన్నారు.చిన్నారుల సంఖ్యను పెంచేందుకు అంగన్వాడీ బాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.పూర్వ ప్రాథమిక విద్య,బోధనా పద్ధతులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూలు ప్రధానోపాధ్యాయురాలు ఇందిరా ప్రియదర్శిని,అంగన్వాడి టీచర్లు షేక్ లాల్ బి, రమ,ఆశ కార్యకర్త కవిత,అంగన్వాడీ పిల్లలు,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు