మొక్కలు నాటండి పర్యావరణ పరిరక్షించండి:ఎంవీఐ జిలాని
కోదాడ,జులై 18(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలని కోదాడ ఎంవీఐ జిలాని,మై హోమ్ ఎస్టేట్ మేనేజర్ చెరుకు అశోకు లు అన్నారు.గురువారం మై హోమ్ ఎస్టేట్ యాజమాన్యం రవాణా శాఖ సంయుక్తంగా మై హోమ్ ఎస్టేట్లో వనమాహోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంవిఐ జిలాని పాల్గొని మొక్కల నాటారు.అనంతరం వారు మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కను చెట్టుగా ఎదిగేందుకు సంరక్షణ బాధ్యత తీసుకోవాలని వారు సూచించారు.ఈ సందర్భంగా 300 మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో మేనేజర్ చెరుకు అశోక్,భాస్కర్,ముత్యాలు,విష్ణువర్ధన్ రావు,బాలు,ప్రవీణ,పోలీసులు,డ్రైవర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు