కార్యక్రమంలో పాల్గొన్న నారాయణ కాన్సెప్ట్ స్కూల్ (2011-12) బ్యాచ్ టెన్త్ విద్యార్థులు
కోదాడ,జులై 21(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పట్టణ పరిధిలోని నారాయణ కాన్సెప్ట్ స్కూల్ ఉన్నత పాఠశాల 20011-2012 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా 2011_2012 విద్యా సంవత్సరంలో టెన్త్ చదువుకున్న పూర్వ విద్యార్థులు అపూర్వ కలయికను నిర్వహించి పాఠశాలలో వారి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.విద్యార్థులు ఒకరిని ఒకరు కలుసుకొని వారి వారి కుటుంబాల పరిస్థితులను,యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఈ పాఠశాలలో విద్యను అభ్యసించిన రోజుల్లో గత స్మృతులను నెమరు చేసుకున్నారు.పాఠశాల స్థాయి విద్యను అభ్యసించిన రోజులు ఎంతో విలువైన రోజులని ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు తమ మనోభావాలను వ్యక్తపరిచారు.తమ సహ విద్యార్థులు ఎవరైనా అనారోగ్యంతో,ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే వారికి అందరూ కలిసికట్టుగా ఆర్థిక సహాయం అందిస్తామని,అలానే పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.విద్యార్థులను తోటి ఉపాధ్యాయులను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు అనంతరం ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మామిడి రాము.షేక్ జహీర్ తో పాటు విద్యార్థులు బలుపు సతీష్,సలాంబాబు,వెంకన్న,ఖలీల్,నరేందర్ రెడ్డి,షకీల్ తదితరులు పాల్గొన్నారు.
Pls subscribe to my channel https://www.youtube.com/live/0_KjbD240G4?si=oNdQ779d_tKUaZ7s