ఇచ్చిన హామీలను నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ:తూమాటి వరప్రసాద్ రెడ్డి
కోదాడ,జులై 22(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను మాట తప్పకుండా నెరవేర్చి చూపెట్టిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి అన్నారు. సోమవారం గుడిబండ గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డికి గుడిబండ కాంగ్రెస్ పార్టీ తరపున,గుడిబండ గ్రామ రైతులు కలిసి రైతులకు రుణమాఫీ చేసినందుకు పాలాభిషేకం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు.ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి హాజరైనారు.ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి అని,బడుగు బలహీన వర్గాల పార్టీ అని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తుందని అన్నారు అదేవిధంగా మన కోదాడ నియోజకవర్గ ప్రజలకు ఉత్తంకుమార్ రెడ్డి,పద్మావతి రెడ్డి లాంటి నాయకులు ఉండటం మన కోదాడ నియోజకవర్గ ప్రజల అదృష్టం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇర్ల సీతారాం రెడ్డి,అమరనాయని వెంకటేశ్వరరావు,కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస రెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇర్ల నర్సింహారెడ్డి,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఎండి రఫీ,కాంగ్రెస్ పార్టీ నాయకులు వాచేపల్లి వెంకటేశ్వర రెడ్డి,ఓరుగంటి రామకృష్ణారెడ్డి,కుక్కడపు సైదులు,నాగరాజు,ఎండి హసన్ అలీ,ఇర్ల నరోత్తమ రెడ్డ,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Pls subscribe to my channel https://www.youtube.com/live/0_KjbD240G4?si=oNdQ779d_tKUaZ7s