డిగ్రీ ఫలితాలలో త్రివేణి డిగ్రీ కళాశాల హవా!
కోదాడ,జులై 24(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మహాత్మా గాంధీ యూనివర్సిటీ మంగళవారం ప్రకటించిన సెమిస్టర్ డిగ్రీ ఫలితాలలో కోదాడ త్రివేణి డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి మంచి ఫలితాలు సాధించారు.కళాశాలకు చెందిన ఆర్ భాగ్యలక్ష్మి రెండవ సెమిస్టర్ లో 10/10 జిపిఏ గ్రేడ్ , నాలుగో సెమిస్టర్ లో ఎండి దానిష్ ఉజ్మా 9.88,ఆరో సెమిస్టర్ లో దొంగరి స్వస్తిత 9.52,కొండా ప్రసన్న 9.48 జిపిఏ గ్రేడ్ సాధించారు.ఈ సందర్భంగా త్రివేణి డిగ్రీ విద్యాసంస్థల చైర్మన్ బాణాల వసంత వెంకటరెడ్డి విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్,వైస్ ప్రిన్సిపాల్,అధ్యాపక మిత్రులు తదితరులు పాల్గొన్నారు.