కోదాడ ప్రభుత్వ దవాఖానాలో ఖాళీగా ఉన్న డాక్టర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలి:మేకల శ్రీనివాసరావు
కోదాడ,జులై 24(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ ప్రభుత్వ దావఖానకు ప్రస్తుత డిప్యూటేషన్ పై ఉన్న ఇంచార్జీ సూపరిండెంట్ డాక్టర్ దశరథ కోదాడ ప్రభుత్వాసుపత్రికి బదిలీ అయి ఇంచార్జ్ సూపర్డెంట్ గా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఏఐటీయూసీ అనుబంధం సంఘాలు మెడికల్ కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు. బుధవారం భద్రాచలం నుండి బదిలీ అయి కోదాడ హాస్పిటల్ లో జాయిన్ అయినా పిల్లల డాక్టర్ రాజశేఖర్ రెడ్డిని సన్మానించారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్నటువంటి డాక్టర్స్,ల్యాబ్ టెక్నీషియన్ ఇతర సిబ్బందిని తక్షణమే నియమించాలని ఆయన కోరారు.నియోజకవర్గ కేంద్రమైనటువంటి కోదాడలో జాతీయ రహదారి పైన ప్రమాదాల జరుగుతున్నప్పటికీ ఆర్థోపెడిక్ డాక్టర్ లేకపోవడం నియోజకవర్గ కేంద్రం లో ఉన్న హాస్పటల్ కు వేలాదిమంది రోగులు వస్తున్నారని వారికి అందుబాటులో వైద్యం లేదు కారణం డాక్టర్లు,సిబ్బంది లేకపోవడం 16 మంది డాక్టర్లకు గాను నలుగురు మాత్రమే పనిచేస్తున్నారని మిగతావన్నీ ఖాళీగా ఉన్నాయని తక్షణమే ఖాళీని భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అనుబంధ నాయకులు బి స్రవంతి,బాలు,షేక్ రఫీ,నాగరాజు,వెంకమ్మ తదితరులు పాల్గొన్నారు