అక్రమ అరెస్టులను ఖండించండి:ధరావత్ రవి పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి
కోదాడ,జులై 24(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కాంగ్రెస్ పాలన అంటే ప్రజా పాలన అని చెప్పుకుంటున్నటువంటి సిఎం రేవంత్ రెడ్డి నేడు విద్యారంగ సమస్యలపై ఉద్యమిస్తున్న విద్యార్ధి,యువజన నాయకులను అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అక్రమంగా అరెస్టు చేయడం సరైనది కాదని ప్రగతిశీల యువజన సంఘం(పివైఎల్) జిల్లా ప్రధాన కార్యదర్శి డి రవి ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా డి రవి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యార్థులకు పెద్దపీట వేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి నేడు విద్యారంగ సంస్థలపై ఉద్యమిస్తున్న విద్యార్థి నాయకులను అక్రమంగా అర్ధరాత్రి అరెస్టు చేసి నిర్బంధించడం సరైన కాదని వారన్నారు.అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని విద్యార్థులతో గత రెండు రోజులుగా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి పిడిఎస్ యు,పివైఎల్ విద్యార్థి యువజన నాయకులను కావాలని కుట్రపూరితంగా అర్ధరాత్రి ఇండ్లకు వచ్చి అరెస్టు చేయడం దేనికి సూచికమని వారు ప్రశ్నించారు.ప్రజాపాలనని చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం కంటే హీనంగా ప్రవర్తిస్తూ విద్యార్థి యువజన నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పాలన కొనసాగించటం ఎంతవరకు న్యాయమని వారన్నారు.ఇదేవిధంగా నిర్బంధాలతో పాలన కొనసాగించాలనుకుంటే కెసిఆర్ కు పట్టిన గతి రేవంత్ రెడ్డికి పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు.అక్రమంగా అరెస్ట్ చేసిన విద్యార్థి,యువజన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.