ప్రతి కుటుంబానికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్థిక భద్రతను కల్పిస్తుంది
పెనుపహాడ్,జులై 24(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ ఆర్థిక భద్రతను కల్పిస్తుందని,సంపాదించే వ్యక్తి ఏ కారణం చేతనైనా చనిపోతే ఆ కుటుంబానికి అండగా ఉంటుందని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏజీఎం అట్లా సురేష్ అన్నారు.పెన్పహాడ్ మండల పరిధిలోని చెట్ల ముకుందాపురం గ్రామానికి చెందిన ఐతగాని సైదులు గత ఆరు నెలల క్రితం శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 66,311 పాలసీ తీసుకోవడం జరిగినది.పది నెలల క్రితం అనారోగ్య కారణంతో మృతి చెందారు.కాగా నామిని అయిన మృతుని భార్య ఐతగాని మాధవి బుధవారం 7,82,643/- రూపాయలు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ చెక్కును ఏజీఎం అట్లా సురేష్ చేతులమీదుగా అందజేశారు.ప్రతి కుటుంబం ఆర్థిక భద్రత భద్రతలో భాగంగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలని కోరారు.ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటే కట్టిన పాలసీకి వడ్డీతోపాటు బోనస్ డబ్బులు కలిపి వస్తాయని అన్నారు.ఇన్సూరెన్స్ అనేది మంచి పథకం అని జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాదని,ఆరోగ్యంగా ఉన్న వారికి కూడా ప్రమాదాలు పొంచి ఉంటాయని ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ పై అవగాహన పెంచుకోవాలని,ఇన్సూరెన్స్ ఎంచుకోవాలన్నారు.అది భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ డిఎం చిరంజీవి,బీఎం భరత్ కుమార్,ఎస్ఎం నరసింహారావు,డిఓ పొనుగోటి వీరాంజనేయులు,గ్రామ ఉపసర్పంచ్ శేఖర్,కొండమీది గోవిందరావు,స్నేహ స్కూల్ ప్రిన్సిపాల్ నలబోలు గోపి రెడ్డి,వరకల లచ్చయ్య,సింగం నాగలింగం,ఉన్నదేవర వెంకటేశ్వర్లు,మామిడి యాదగిరి,కంపెనీ డివోలు,ఎస్ఓ లు పాల్గొనడం జరిగినది.
Pls subscribe to my channel https://www.youtube.com/live/0_KjbD240G4?si=oNdQ779d_tKUaZ7s