విద్యార్థులకు మానసిక వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలి
:టెలిమానస్ టోల్ ఫ్రీ నెంబర్ 14416 సద్వినియోగం చేసుకోవాలి.
:సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:డాక్టర్ వీరేంద్రనాథ్
సూర్యాపేట,జులై 26(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి వైద్య సిబ్బందిని సంప్రదించి వ్యాధుల బారినపడకుండా పడకుండా చూసుకోవాలని కందగట్ల ప్రభుత్వ వైద్యశాల వైద్యాధికారి వీరేంద్రనాథ్ తెలిపారు.శుక్రవారం ఎస్ ఆత్మకూర్ మండల పరిధిలోని నెమ్మికల్ గ్రామములో విద్యార్థులకు మానసిక వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ వీరేంద్రనాథ్ పాల్గొని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు,ఎస్టీ ప్రభుత్వ బాలుర వసతి గృహములో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు అవగాహన కల్పించారు.అనంతరం ఆయన మాట్లాడారు విద్యార్థులు మానసిక వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలు కల్పిస్తున్న టెలీమానస్ టోల్ ఫ్రీ నెంబర్ 14416 సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి ప్రజలు పరిశుభ్రత పాటించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.ముఖ్యంగా టైఫాయిడ్ డెంగ్యూ మలేరియా జ్వరాలు వ్యాధులపై అవగాహన కల్పిస్తూ సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు వైద్య సిబ్బందిని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రాఖెండ్ కుమార్,హాస్టల్ వార్డెన్ లింగయ్య,ఏఎన్ఎం పూలమ్మ ,ఆశా కార్యకర్తలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.