ఇక్కడ స్థల యజమాని పేర్లు, కొలతలు మార్చబడును…
చిలుకూరు,జులై 26(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:చిలుకూరు మండల కేంద్రానికి స్వతంత్ర పోరాట ఉద్యమ కాలంలో అష్టమాంధ్ర మహాసభ నిర్వహించిన ఘన చరిత్ర కలిగినది.నాడు అష్టమాంధ్ర మహాసభ నిర్వహించిన ప్రదేశంలోనే ఈ ఆర్ఎన్ఆర్ (రావి నారాయణరెడ్డి) కాలనీని (1983-84) ఏర్పాటుచేసి పేదలకు ఇల్లు నిర్మించి అప్పగించారు.నాటి నుంచి నిరుపేదలు వారికి కేటాయించిన ఇండ్లలో నివసిస్తున్నారు.ఒక్కొక్కరికి 242 గజాలతో కూడిన ఇంటిని కేటాయించారు.ప్రస్తుతము కాలనికి సంబంధించిన ఇంటి యజమాని పేరు మార్చడం తో పాటుగా స్థలాల కొలతల సైతం గ్రామపంచాయతీ రికార్డులలో తారుమారు చేస్తున్నారు.కేవలం డబ్బులే పరమావధిగా భావించి పంచాయతీ అధికారులు కొందరు ఈ అక్రమాలకు తెరలేపారు. స్థలాలకు సంబంధించి పోలీస్ స్టేషన్ లో సైతం బాధితులు కేసులు పెట్టుకోవడం కూడా జరిగింది.స్థలాల కొలతలు,పేరు మార్పుల విషయంలో బాహాటంగానే పంచాయతీ అధికారులతో వాగ్వాదానికి పాల్పడిన ఘటనలు కోకొల్లలు.ఇప్పటికైనా ఈ విషయంపై సంబంధిత అధికారులు చొరవ చూపి వాగ్వాదాలకు దారి తీయకుండా చూడాలని గ్రామస్తులు, కాలనీవాసులు కోరుతున్నారు.