గత వారం రోజుల నుండి తాసిల్దార్ కుర్చీ ఖాళీ
:అన్ని రకాల పత్రాలు అందక సతమతమవుతున్న ప్రజలు
:క్యాస్ట్ సర్టిఫికెట్లు అందక విద్యార్థులు సతమతం
కోదాడ,జులై 27(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనరల్ బదిలీలు జరుగుచున్నాయి.దానిలో భాగంగా అనంతగిరి మండలంలో తాసిల్దార్ కార్యాలయంలో కూడా బదిలీలు జరిగినాయి ఈ బదిలీలలో అనంతగిరి తహసీల్దార్ కూడా గత వారం రోజుల క్రితం బదిలీ అవ్వడంతో ఇంతవరకు వేరే తహశీల్దార్ రాకపోవడంతో విద్యార్థులు సర్టిఫికెట్ల రాక నానా ఇబ్బందులు పడుతున్నారు.అటు ప్రజలు వారికి సంబంధించిన పత్రాలు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు తక్షణమే అనంతగిరి తాసిల్దార్ కార్యాలయానికి తాసిల్దార్ ని నియమించాలని విద్యార్థులు,మండల ప్రజలు వాపోతున్నారు.