పేద ప్రజల గోడు పట్టని నరేంద్ర మోడీ విధానాలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కండి:బెజవాడ వెంకటేశ్వర్లు
కోదాడ,జులై 30(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ )కోదాడ పట్టణ కౌన్సిల్ సమావేశం కోదాడ సిపిఐ కార్యాలయంలో జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ విధానాలతో భారత్ లోని ప్రజలు నిరాశ నిస్రోహతో కొట్టుమిట్టలాడుతున్నారని ధనిక వర్గాల చేతుల్లో భారత దేశ భవిష్యత్తును పెడుతున్న నరేంద్ర మోడీ భారత దేశ ప్రజలకు అచ్చే దిన్ అని నినాదించి ఇవాళ దేశ ప్రజల మోసం చేస్తున్ననరేంద్ర మోడీ కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక ఆలోచనతో భారతదేశాన్ని ఇద్దరు ముగ్గురు వ్యక్తుల చేతిలో తాకట్టు పెట్టడం కోసం ప్రయత్నిస్తున్నాడని ఇలాంటి చర్యలను యావత్ భారతదేశం ఖండించి దేశ ప్రజలంతా ఒకటై బిజెపి నరేంద్ర మోడీ విధానాల పైన సమరశీల పోరాటాలు సమర్థం కావాలని ఆయన పిలుపునిచ్చారు.రాష్ట్రంలో అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ఆరు నెలల తిరగకముందే ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు పరచడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆయన తీవ్రంగా విమర్శించారు.ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాసరావు,సిపిఐ పట్టణ కార్యదర్శి షేక్ లతీఫ్,జిల్లా కార్యవర్గ సభ్యులు బత్తిని హనుమంతరావు,బద్దం కృష్ణారెడ్డి,సిపిఐ సీనియర్ నాయకులు పైడిమర్రివెంకటనారాయణ,డివిజన్ కార్యదర్శులు ఉప్పతల శ్రీనివాస్,షేక్ నాగుల్ మీరా,అంజమ్మ,షేక్ రెహమాన్,మోసిన్,కే సతీష్,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.