పటాన్ చెరువు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పలారం బండి ఊరేగింపు
సంగారెడ్డి,జులై 31(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పట్టణ పరిధిలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పలారం బండి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పోతరాజుల విన్యాసాలు పిల్లల ఆటపాటలు డీజే సౌండ్లతో ప్రజలను అల్లరింప చేశారు.ఈ సందర్భంగా ముదిరాజ్ సంగం యువకులు నాగసాని నరేష్ మాట్లాడుతూ వర్షాలు బాగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలను సుఖ సంతోషాలతో ఉంచాలని అమ్మవారిని వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు జైపాల్,సఫాన్ దేవ్,టప్పకుమార్,నాగసాని శ్రీరాములు,నీరుడి వీరయ్య,పెద్ద బోయిన శ్రీనివాస్,మస్కూరి నాగేష్,సడబోయిన రవి,జలగరి ఎట్టయ్య,జలగరి దేవా,నాగసాని మాణిక్యం,నాగసాని రమేష్ ,ముదిరాజ్ సంఘం నాయకులు,పెద్దలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.