2018 నుంచి కాటేపల్లి తాండ గ్రామానికి సర్పంచ్ లేరు.
కామారెడ్డి,జులై 31(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కామారెడ్డి జిల్లా పెద్దకొడపగల్ మండలంలోని కాటేపల్లితండాకు 2018 సర్పంచ్ ఎన్నికలల్లో ఎస్టీ రిజర్వేషన్ ను ప్రభుత్వం కేటాయించింది.కానీ తాండలో బీసీ కి చెందినవారు మాత్రమే ఉండటంతో సర్పంచ్ లేక తండా అభివృద్ధి లో వెనుకబడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుత సర్పంచ్ ఎన్నికలల్లో అయినా ప్రభుత్వం తండాకు బీసీ రిజర్వేషన్ కల్పించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.