Monday, December 23, 2024
[t4b-ticker]

కొత్తగూడ మండల టీయూడబ్ల్యూజే (ఐజేయూ ) యూనియన్ వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

- Advertisment -spot_img

కొత్తగూడ మండల టీయూడబ్ల్యూజే (ఐజేయూ ) యూనియన్ వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

కొత్తగూడ,జులై 31(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల టీయూడబ్ల్యూజే (ఐజేయూ ) యూనియన్ వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) కొత్తగూడ మండల కమిటీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కు జర్నలిస్టుల సమస్యలను వివరించి అనంతరం వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఐజేయు కొత్తగూడ మండల అధ్యక్షులు సల్మాన్ పాషా మాట్లాడుతూ ఇటు ప్రజలకు,అటు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ మా కర్తవ్యాలను నిర్వర్తిస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఏజెన్సీ ప్రాంతంలో సొంత ఇల్లు లేక అనేక కష్టనష్టాలను ఓర్చి జీవనం కొనసాగిస్తున్నారు అని ఆయన గుర్తు చేశారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక నిర్మాణాత్మకమైన పాత్రను పోషిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి మా వంతు కృషి చేస్తున్నాం అని,ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో మేము ఆశించిన స్థాయిలో మాకు ఎటువంటి న్యాయం జరగలేదు,పైగా అవమానాలు చీత్కారాలు మాకు మిగిలాయి.ప్రస్తుతం ఉన్న ప్రజా ప్రభుత్వంలోనైనా మాకు తగు న్యాయం చేస్తారని ,ప్రస్తుత పాలక పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని ప్రధానంగా ఇళ్ల స్థలాలతో,పాటు ఇందిరమ్మ ఇండ్డ్లు మంజూరు,నూతన హెల్త్ కార్డుల మంజూరు చేసి వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు కార్పొరేట్ కళాశాల మరియు పాఠశాలలో ఉచిత విద్యా అవకాశాలు కచ్చితంగా కల్పించే విధంగా మరియు ఏజెన్సీ ప్రాంతాల్లో జర్నలిస్టులపై జరిగే దాడులను తక్షణమే అరికట్టేందుకు జర్నలిస్టులకు చట్టబద్ధమైన రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐజేయు జిల్లా నాయకులు పాలడుగు శ్రీధర్,శెట్టి పరశురాములు,మండల ఉపాధ్యక్షులు గోగు విజయకుమార్,ప్రచార కార్యదర్శిలు తీగల ప్రేమ్ సాగర్,ఉబ్బని శ్రీహరి,గంగిశెట్టి రాకేష్ వర్మ,ఈక నరేష్,కోశాధికారి బైరబోయిన అశోక్,శ్యామ్,దేవేందర్,లక్ష్మీనరసయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular