విశ్రాంత ఉద్యోగుల న్యాయమైన హక్కులను నెరవేర్చాలి.
:హక్కుల కోసం సంఘ పరంగా నిరంతర పోరాటం.
:సమాజానికి పెన్షనర్లు ఆదర్శంగా ఉండాలి,:విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ళ. సీతారామయ్య.
కోదాడ,జులై 31(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:విశ్రాంత ఉద్యోగుల న్యాయమైన హక్కులను ప్రభుత్వం నెరవేర్చాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య అన్నారు.బుధవారం కోదాడ పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జులై నెలలో జరుపుకునే విశ్రాంత ఉద్యోగుల సామూహిక జన్మదిన వేడుకల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.గత ప్రభుత్వంలో తమ సమస్యల పట్ల ధర్నాలు,నిరసనలు తెలుపుకునేందుకు కూడా అవకాశం లేదని అన్నారు.ప్రభుత్వం ఉద్యోగులకు నేటికి ఐదు డిఏలు ఇవ్వాల్సి ఉన్నా వాటి గురించి అడిగే దిక్కే లేదన్నారు.సమస్యల పట్ల పెన్షనర్లు రాజీలేని పోరాటం చేస్తున్నారని న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. పెన్షనర్లు సామాజిక సేవ చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు.అనంతరం పుట్టినరోజు జరుపుకునే వారిని శాలువా,పూల బొకేతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కోదాడ యూనిట్ అధ్యక్షులు వెనేపల్లి శ్రీనివాసరావు,జిల్లా అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి,విశ్రాంత డీఈవో హనుమారెడ్డి,అమృత రెడ్డి,మల్లెంపల్లి వెంకటేశ్వరరావు,పొట్ట. జగన్మోహన్,విద్యాసాగర్,రఘు వరప్రసాద్,భ్రమరాంబ,శోభ తదితరులు పాల్గొన్నారు……..