అధికారుల కాసుల కక్కుర్తికి కాంట్రాక్టర్ల పనితీరు మారేనా?
:గుడిబండ రోడ్ లోని ట్రాన్స్ఫార్మర్ వద్ద డ్రైనేజ్ స్లాబు డ్యామేజ్
:నాణ్యత లోపాలతో పనితీరు
:ఇలాంటి కాంట్రాక్టర్ల కాంట్రాక్టు లైసెన్సులో రద్దు చేయాలి
కోదాడ,జులై 31(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మున్సిపల్ పరిధిలోని గుడిబండ రోడ్డులోని వెంగమాంబ అపార్ట్మెంట్ రోడ్డులో ట్రాన్స్ఫార్మర్ వద్ద మెయిన్ డ్రైనేజ్ పై వేసిన స్లాబ్ లారీ వెళ్లడంతో ఒక్కసారిగా స్లాబ్ విరిగిపోయిన సంఘటన 19వ వార్డులో చోటుచేసుకుంది.వార్డు ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం గత ప్రభుత్వం లో గుడిబండ మెయిన్ రోడ్డు వెంబడి మినీ బైపాస్ బంజర కాలనీ రోడ్డు నుండి తమ్మర వాగు బ్రిడ్జి వరకు మెయిన్ డ్రైన్ నిర్మాణం పనులు కోట్ల రూపాయల పెట్టి నిర్మాణం చేపట్టారు.ఈ డ్రైన్ వీధుల వద్ద స్లాబ్ నిర్మాణాలు గత పది నెలల క్రితం చేపట్టారు.ఈ స్లాబ్ నిర్మాణానికి 16 ఎంఎం,12 ఎంఎం ఐరన్ వాడాలి కానీ కాంట్రాక్టర్ కాసులకు కక్కుర్తి పడి మొత్తం 10 ఎంఎం ఐరన్ వాడినారు.ఇసుక వాడాల్సింది పోయి పూర్తిగా డస్ట్ వాడినారు.సిమెంటు కూడా తక్కువ వేసి మినిమం 12 ఇంచెలు పోయాల్సిన స్లాబు మూడు ఇంచలే పోయడం వలన లారీ దాని మీదగా వెళ్లగానే ఒకసారిగా కుప్పకూలిపోయిందని వార్డు ప్రజలు వాపోతున్నారు.ఈ పని జరిగే సమయంలో సంబంధిత అధికారులు దగ్గరుండి కూడా నాణ్యత లోపాలతో ఇలా చేయించడం వలన ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు వాపోతున్నారు.ఇకనైనా సంబంధిత అధికారులు నాణ్యతగా పనులు చేపట్టే కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు ఇవ్వాలని ఇలాంటి నాణ్యత లోపాలతో నిర్మించిన కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు ఇవ్వకుండా లైసెన్సులు రద్దు చేయాలని మెయిన్ డ్రైన్ పై అన్ని స్లాబులు ఇలానే వేశారని సంబంధిత క్వాలిటీ కంట్రోల్ అధికారులు చెక్ చేసి కాంట్రాక్టర్లపై తగు చర్యలు తీసుకోవాలని వార్డు ప్రజలు వాపోతున్నారు.