భీమీశెట్టి వెంకటేశ్వర్లు మృతి ఆ కుటుంబానికి తీరని లోటు:రాష్ట్ర ఐఎన్టియుసి ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్
కోదాడ,జులై 31(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మంగళవారం రాత్రి గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించినారు కోదాడ ప్రాంత పారబోయిల్డ్ రైస్ మిల్ డ్రైవర్స్ యూనియన్( ఐఎన్టియుసి)ప్రధాన కార్యదర్శి భీమీశెట్టి వెంకటేశ్వర్లు పార్థివ దేహం పై పూలమాలవేసి నివాళులర్పిస్తున్న రాష్ట్ర ఐఎన్టియుసి ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్.ఈ సందర్భంగా మాట్లాడుతూ భీమిశెట్టి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి యొక్క సహకారంతో ఆదుకుంటామని తెలియజేస్తూ,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసినారు.ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు కాసర్ల శ్రీనివాసరావు,సలిగంటి జానయ్య,ఉప్పు శ్రీనివాస్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.