గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
:ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి మృతదేహం తరలింపు.
కోదాడ,జులై 31(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మంగళవారం సాయంత్రం 04.00 గంటల సమయంలో కోదాడ పట్టణంలోని గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఎస్ఐ ఎ. రంజిత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం శ్రీమన్నారాయణ కాలనీలో గల బిసి హాస్టల్ సమీపంలోని ఖాళీ స్థలములో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి సుమారు 50 నుండి 60సం” లు మృతి చెందాడని సమాచారం రాగ, మృతుడి శరీరంపై ఎరుపు రంగు నిక్కర్ (షార్ట్) శరీరంపై చొక్కా లేకుండా ఉన్నాడు. మృతుడి వివరాలు లభ్యం కాకపోవడంతో, మున్సిపల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, శవంను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించామనీ, మృతుడి సమాచారం తెలిసిన వారు ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్ లో సంప్రదించగలరనీ,పత్రిక ప్రకటనలో కోదాడ టౌన్ ఎస్ఐ రంజిత్ రెడ్డి తెలిపారు.