ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండానే కవాటాల మార్పిడి:డాక్టర్ కరుణాకర్ రాపోలు
హైదరాబాద్, జులై 31(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండానే వివిధ థెరపీల ద్వారా గుండెకు కృత్రిమ కవాటాలు ఏర్పాటు చేయవచ్చు.తొడ లేదా చేతి,మెడ భాగం నుంచి క్యాథటర్ ను ఉపయోగించి ఈ చికిత్సను విజయవం తంగా పూర్తిచేయవచ్చు.గుండె ధమనుల్లో తీవ్రమైన పూడికలకు స్టెంట్స్ వీలుకాకపోతే ఐవీఎల్,లేజర్ సాంకే తికతతో తొలగించే అవకాశం ఉంది. చెడు కొలెస్ట్రాల్ నియంత్రణకు 90 శాతం మందిలో మాత్రలు వాడితే సరిపోతుంది.ఎంపిక చేసిన వారికే ఇంజక్షన్లు అవసరం.ఇంకా ఎక్కువ స్థాయిలో ఉంటే రక్తశుద్ధి(అల్ట్రాఫిల్టరేషన్) ప్రక్రియ ద్వారా తగ్గిస్తామని:డాక్టర్ కరుణాకర్ రాపోలు,ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు,అపోలో హాస్పిటల్ వారు తెలిపారు.