రైతు పక్షం కాంగ్రెస్ ప్రభుత్వం: షేక్ జానీ
కోదాడ,ఆగష్టు 01(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని నిర్ణయించడంపై కోదాడ అసెంబ్లీ సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ షేక్ జాని హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా జానీ మాట్లాడుతూ వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ప్రకటించిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.2018 నుండి2023 డిసెంబర్ 9 వరకు రైతులు తీసుకున్న రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేయాలని తీసుకున్న నిర్ణయం అన్నదాతల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని షేక్ జాని అన్నారు.త్వరలో రేషన్ కార్డుల అర్హులకు ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి మంజూరు అవుతాయని తెలిపారు.