ఎస్సీ ల వర్గీకరణ పట్ల సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చినందుకు హర్షం వ్యక్తం:చింతాబాబు మాదిగ…..
కోదాడ,ఆగష్టు 01(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ ఆదేశాల మేరకు మేడి పాపయ్య నాయకత్వంలో 30 సంవత్సరాలు ఏబిసిడి వర్గీకరణ సాధనకై గురువారం సుప్రీంకోర్టులో ఎస్సీల వర్గీకరణ ఏబిసిడిలుగా అమలు చేసుకోవచ్చు అని తీర్పు ఇచ్చినందుకు ఆరుగురు జడ్జిలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా బాబు మాదిగ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలు నుండి ఎస్సీలను ఏబిసిడిలుగా విభజించాలని ఎన్నో పోరాటాలు చేయటం వలన కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం పట్ల ఎమ్మార్పీఎస్ పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నమన్నారు.ఆనాడు ఏబిసిడి వర్గీకరణ సాధనకై అమరులైన మాదిగలు వారి ఆత్మ శాంతి ఈరోజు కలిగిందని మేము భావిస్తున్నాం ఏదైతే జాతి కోసం జాతి ప్రయోజనాల కోసం ఏబిసిడి వర్గీకరణకై అమలు చేయాలని భవిష్యత్తులో మా పిల్లలు విద్య వైద్య,రాజకీయ,ఆర్థిక రంగాల్లో అవకాశాలు వస్తాయని మేము భావిస్తున్నాం.ఈనాడు చారిత్రక తీర్పు ఎందుకంటే గత 30 సంవత్సరాలు నుండి ఏబిసిడి వర్గీకరణ సాధనకై పోరాటం చేస్తున్నాము ఆ పోరాట ఫలితమే ఈరోజు నిదర్శనమని తెలియజేస్తున్నాం.రాష్ట్రాలుగా అమలు చేయొచ్చు ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అమలు చేస్తా అని మాట ఇవ్వడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మార్పీఎస్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ మాదిగల పట్ల చిత్తశుద్ధి ఉంది అని ముఖ్యమంత్రి ప్రకటన చేయటం వల్ల హర్షం వ్యక్తం చేస్తున్న ఈరోజు కోదాడ పట్టణంలో ఏబిసిడి వర్గీకరణ కేకు కట్ చేసుకుని స్వీట్లు పంచుకోవడం జరిగింది.మాదిగలు మాదిగ ప్రజలు చాలా సంతోషిస్తున్నాను అని నేను భావిస్తున్నా.ఈ కార్యక్రమం అధ్యక్షతన టౌన్ పట్టణ అధ్యక్షులు ఏర్పుల చిన్ని,నియోజకవర్గ ఇన్చార్జ్ బాణాల అబ్రహం నాయకత్వంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో నడిగూడెం మండల ఎంపిపి యాతాకుల జ్యోతి మధు,సీనియర్ నాయకులు ఎమ్మార్పీఎస్ అనుభవజ్ఞులు గంధం రంగయ్య,కౌన్సిలర్ గంధం యాదగిరి,దేవపొంగు బాబు,పిడమర్తి బాబురావు,సీనియర్ నాయకులు ఎంఎస్ఎఫ్ ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి బొల్లెపోగు స్వామి,జిల్లా నాయకులు కందుకూరి నాగేశ్వరరావు,కోదాడ మండల అధ్యక్షులు నారకట్ల ప్రసాద్,ఎంఆర్పిఎస్ మండల నాయకులు కాశయ్య,చంటి,వినయ్,వేణు,విక్కీ,దిలీప్,విక్రమ్,బన్నీ,రాహుల్,ఎమ్మార్పీఎస్,ఎంఎస్ఎఫ్ అనుబంధ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేసి హర్షం వ్యక్తం చేసినారు.