ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ ఓ చారిత్రాత్మక ఘట్టం
:అనగారిన వర్గాలకు ఓ సుదినం.
:కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వానికి ఎస్సీ ఉప కులాల కృతజ్ఞతలు
ఎస్సీ వర్గీకరణతో కోదాడలో ఎస్సీ ఉప కులాల సంబరాలు:మాజీ ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు
కోదాడ,ఆగష్టు 01(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఎస్సీ వర్గీకరణ పై 27 సంవత్సరాల సుదీర్ఘ పోరాట అనంతరం సుప్రీంకోర్టులో ఏబిసిడి వర్గీకరణ అమలుపై సంచలన తీర్పు యావత్ ఎస్సి ఉప కులాలు స్వాగతిస్తున్నాయని,ఇట్టి తీర్పు రావడానికి పూర్తి బాధ్యతతో నేటి కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రజా ప్రభుత్వం కృషి అభినందనీయమని కోదాడ నియోజకవర్గంలో జరిగిన సంబరాల్లో మాజీ ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు అన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మాజీ ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో కమిటీని ఏర్పాటుచేసి ఢిల్లీకి వెళ్లి అక్కడ న్యాయ నింపులతో చర్చించి బలమైన వాదనలు వర్గీకరణ ఇనిపించి వర్గీకరణ సాధించుటలో కృతనిచ్చేయులయ్యారన్నారు.ఇన్ని సంవత్సరాల కాలం పాటు పని చేసినటువంటి ఎస్సీ ఉప కులాల ప్రతినిధులకు,మంత్రివర్యులు నీటిపారుదల,పౌరసరఫరాల శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కోదాడ శాసనసభ్యురాలు నలమాద పద్మావతి రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఉద్యోగ నియామక నోటిఫికేషన్లలో ఏబిసిడి వర్గీకరణ రిజర్వేషన్ల అమలును తక్షణమే నిర్ణయం తీసుకున్నటువంటి కాంగ్రెస్ నేతృత్వంలోఉన్న ప్రజా ప్రభుత్వానికి ఎస్సీ ఉపకులాలను రుణపడి ఉంటాయని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎంఆర్పిఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతాబాబు మాదిగ,గంధం యాదగిరి,గంధం పాండు,గంధం రంగయ్య,బాణాల అబ్రహం,ఉద్యోగ సంఘాల నాయకులు యాతాకుల మధుబాబు తదితరులు పాల్గొన్నారు.