మున్సిపల్ కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ ఉద్యమ నాయకుడికి ఘన సన్మానం_
కోదాడ,ఆగష్టు 02(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి హర్షం వ్యక్తం చేస్తూ కోదాడ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ( ఎమ్మార్పీఎస్)తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి ఆంజనేయులుకి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ మున్సిపల్ కౌన్సిలర్ బెజవాడ శిరీష శ్రవణ్ పాల్గొని ఉద్యమ నాయకులు ఆంజనేయులును శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు.అనంతరం వారు మాట్లాడుతూ దళిత జాతి కోసం 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసిన మంద కృష్ణ ఆధ్వర్యంలో ఎందరో మాదిగలు కలిసి చేసిన పోరాట ప్రతిఫలమే వర్గీకరణ అని కొనియాడారు.
అలాంటి వారిలో మన కోదాడ ప్రాంతానికి చెందిన ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకులు కొండపల్లి ఆంజనేయులు సన్మానించడం మాకెంతో ఆనందంగా ఉందని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కత్తి భగత్,బెజవాడ చందర్రావు,దేవపంగు సాయి,బెజవాడ ప్రేమ్చంద్,చింతా కుమార్,దిలీప్,కాంగ్రెస్ పార్టీ బిసి నాయకులు బైరు శ్రీను,డా,, జానకిరాం,స్నేహితులు,శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.