ఆగస్టు 5 నుండి గీత కార్మికులకు సేఫ్టీమోకుల పంపిణీ:కౌండిన్య గౌడ సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు కేఎల్ఎన్ ప్రసాద్.
కోదాడ,ఆగష్టు 02(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచ్,పేరున ప్రమాదాల నివారణ కోసం తయారు చేయించిన సేఫ్టీమోకులను బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అబ్దుల్లాపూర్మెట్ మండలం లస్కర్ కూడా గ్రామంలో ఇటీవల లాంఛనంగా ప్రారంభించిన విషయం విధితమే.బీసీ సంక్షేమ,రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ బడ్జెట్ కేటాయింపు చేయించి ఆగస్టు 5వ తేదీ నుండి ప్రతి నియోజకవర్గానికి 100 చొప్పున అందజేయనున్నట్లు కౌండిన్య గౌడ సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది టిపిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ కెఎల్ఎన్ ప్రసాద్ తెలిపారు.శుక్రవారం కోదాడలో తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి 100 మోకులు పంపిణీ కార్యక్రమం చాలా హర్షదాయకమని ఈ సందర్భంగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి పొన్నం ప్రభాకర్ కి కృతజ్ఞతలు ధన్యవాదములు తెలిపారు.సూర్యాపేట జిల్లాలో పౌరసరఫరాలు,భారీ నీటిపారుదల శాఖ మాత్యులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్నట్లు,కోదాడలో ఎమ్మెల్యే ఎన్ పద్మావతి రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్నట్లు కేఎల్ఎన్ తెలిపారు.మరికొద్ది కాలంలో అర్హులైన వారందరికీ కూడా సేఫ్టీమోకులు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తుందని కేఎల్ఎన్ ప్రసాద్ తెలిపార