Monday, December 23, 2024
[t4b-ticker]

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జ్ఞాపికన మగ్గంపై నేసిన చేనేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్

- Advertisment -spot_img

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జ్ఞాపికన మగ్గంపై నేసిన చేనేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్

సిరిసిల్ల,ఆగష్టు 02(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:రాజన్న సిరిసిల్ల జిల్లా ఆ నేత కళాకారుడడికి అరుదైన అవకాశం దొరికింది. అతని నైపుణ్యం చూసిన డిప్యూటీ సీఎం అభిమాని,పవన్ కళ్యాణ్ కు డ్రెస్ కు క్లాత్ నేసే ఆర్డర్ సిరిసిల్ల కళాకారుడికి ఇచ్చాడు.అమెరికా లోని అట్లాంటా కు పవన్ అభిమాని నుండి సుమారు ఆరు లక్షల విలువ చేసే డ్రెస్ ల తయారి చేసే ఆర్డర్ తీసుకుని,వాటిని పూర్తి చేసి పంపించాడు.అవకాశం ఇస్తే ఎన్నో అద్భుతాలు సృష్టించే నైపుణ్యం సిరిసిల్ల నేతన్నలు వద్ద ఉందని నిరూపించాడు.మరి ఆ డ్రెస్సుల ప్రత్యేకత ఏమిటో ఒకసారి చూద్దామా సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ చేనేత మగ్గంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జ్ఞాపికను తయారుచేసిన కళను చూసి అమెరికాలోని అట్లాంటాకు చెందిన పవన్ కళ్యాణ్ అభిమానుడు,పవన్ కళ్యాణ్ కి చేనేత మగ్గం పై నేసిన వస్త్రాలు తయారు చేయమని ఐదు నుండి ఆరు లక్షల విలువగల చేనేత వస్త్రాలు తయారు చేయమని ఆర్డర్ ను ఇవ్వడం జరిగింది.ఆర్డర్ తీసుకున్న హరిప్రసాద్ దంపతులు దాదాపు 25 రోజులు శ్రమించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఇచ్చే డ్రస్సులు నెసి వారికి పంపడం జరిగింది.హరి ప్రసాద్ దంపతులు 25 రోజులపాటు శ్రమించి నెసినారు.ఇందులో జనసేన లోగో రావడానికి డిజైన్ ప్రకారం తాళ్లు కట్టుకోవడానికి ఐదు రోజుల సమయం పట్టింది ఇందులో వార్పు కాటన్ 100 నంబర్ దారం లడీలుగా తీసుకొని వార్పు తయారు చేసుకున్నాం 100 లెనిన్ ఉపయోగించి పేక మాలను రాట్నంతో ఊసల పై హరిప్రసాద్ భార్య చుట్టిచ్చిన కండలను హరి చేనేత మగ్గం పైన నెసాడు ఇందులో జనసేన లోగో కు పట్టు దారం రెడ్ కలరు బ్లాక్ కలరు ఉపయోగించి లోగో అయిపోయే వరకు పూర్తిగా చేతులతో ఈ దారాలు పెట్టి నెసాడు ఇది అంతా ఒక షర్ట్ చేయడానికి 15 రోజుల టైం పట్టింది డ్రెస్ యొక్క ప్యాంట్ తయారు చేయడానికి 5 రోజులు పట్టింది ఇందులో లెనిన్ పేక మాలు వాడి నెసాము షర్ట్ కు మూడు మీటర్ల వస్త్రము ప్యాంటు రెండు మీటర్ల వస్త్రం ఉపయోగించి లెనిన్ డ్రెస్ చేనేత మగ్గంపై వస్త్రము నెసాడు.2019 నుండి హరి ప్రసాద్ ప్రతి సంవత్సరం చేనేత దినోత్సవానికి ఏదో ఒక విధంగా తన కలను ప్రదర్శిస్తూ వస్తున్నాడు.ఈ సంవత్సరం సిరిసిల్లలోనే మొట్టమొదటిసారిగా చేనేత మగ్గంపై లెనిన్ వస్త్రాల ఉత్పత్తి చేస్తున్నాడు ఈ చేనేత వస్త్రాలు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి నేయడం చాలా సంతోషంగా ఉంది లెనిన్ చేనేత వస్త్రాలు తయారు చేయడానికి మాకు ఆర్డర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అభిమాని కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానడు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular