పట్టణ అభివృద్ధికి నిధులు కేటాయించండి.
:ఎమ్మెల్యేను కలిసిన కోదాడ మున్సిపల్ పాలకవర్గం.
కోదాడ,ఆగష్టు 03(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు కేటాయించాలంటూ కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్,వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు కౌన్సిలర్లతో కలిసి హైదరాబాదులో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా పట్టణంలో పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు.నిధులు లేకపోవడంతో పట్టణంలో అభివృద్ధి కుంటుపడుతుందని ప్రభుత్వ నుండి నిధులు మంజూరు చేయించాల్సిందిగా కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి నిధుల మంజూరుకు తప్పక కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గంధం యాదగిరి,షాబుద్దీన్,శ్రీనివాస్ యాదవ్,సుశీల రాజు,స్వామి నాయక్,లలిత తదితరులు పాల్గొన్నారు.