నకిలీ నోట్ల మూటను అరెస్టు చేసిన మెట్ పల్లి పోలీసులు
జగిత్యాల జిల్లా,ఆగష్టు 03(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న లు మెట్ పల్లి డిఎస్పి ఉమామహేశ్వరరావు తెలిపారు.శనివారం డిఎస్పి కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి డిఎస్పి మాట్లాడుతూ జగిత్యాల జిల్లా తాళ్ల ధర్మారం గ్రామానికి చెందిన సదాల సంజీవ్,జగిత్యాల పట్టణానికి చెందిన బిట్టు శివకుమార్,నిర్మల్ జిల్లాకు చెందిన మగ్గిడి కిషన్,బొంగురాల పుల్లయ్య,కలకుంట గంగారం,ముని మేకల అశోక్ అను ఆరుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి సుమారు 7 లక్షల నకిలీ నోట్లను ఒక కారు ఒక ద్విచక్ర వాహనం 6 సెల్ ఫోన్లు ఐదువేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు గత సంవత్సరం కాలంగా ఇద్దరు చొప్పున ఒక ముఠాగా ఏర్పడి హైదరాబాద్ అదిలాబాద్ కరీంనగర్ జగిత్యాల జిల్లాలలో 10 లక్షల వరకు డబ్బులు లాక్కొని పరారీలో ఉన్నారు.పైన తెలిపిన నిందితులు ఈ నెల ఒకటో తేదీన స్థానిక పెద్ద గుండు వద్దగల డాబా లో ధాబా యజమాని రాజేందర్ వద్ద లక్ష రూపాయల నగదు లాక్కొని వెళ్లిపోగా రాజేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ నిరంజన్ రెడ్డి,ఎస్సై చిరంజీవి బృందం గాలింపు చర్యలు చేపట్టారు గాలింపు చర్యలలో భాగంగా వెంకట్రావుపేట్ వీరేంద్ర ధాబాలో వీరిని గుర్తించి అద్భులోకి తీసుకొని రిమాండ్ కు తరలించామని బీఎస్పీ తెలిపారు నకిలీ నోట్ల మూటను చాకచక్యంగా పట్టుకున్న సిఐ నిరంజన్ రెడ్డి,ఎస్ఐలు చిరంజీవి,రాజు,పోలీస్ సిబ్బందిని డిఎస్పి ఉమామహేశ్వరరావు అభినందించారు.