మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశానికి నివేదికలు సిద్ధం చేయాలి
:అన్ని శాఖల అధికారులు కార్యాచరణ ప్రణాళికలను సమావేశానికి తేవాలి.
:కోదాడ ఆర్డీవో కార్యాలయంలో మంత్రి సమావేశంపై జిల్లా కలెక్టర్ అన్ని శాఖల అధికారులతో సమీక్ష.
కోదాడ,ఆగష్టు 03(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ పట్టణం లోని కాశీనాథం ఫంక్షన్ హాల్ లో ఈనెల 5న విద్యా వైద్య,ఆర్ అండ్ బి,ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించే సమీక్ష సమావేశానికి అన్ని శాఖల అధికారులు కార్యాచరణ నివేదికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవర్ ఆదేశించారు.శనివారం కోదాడ ఆర్డీవో కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ముందస్తు సమావేశం నిర్వహించి మాట్లాడారు.ఆయా శాఖల్లో నెలకొని ఉన్న సమస్యలు పెండింగ్ లో ఉన్న పనులు ప్రస్తుతం జరుగుతున్న పనితీరు భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణ తదితర అంశాల్లో అధికారులు నివేదికలతో మంత్రి సమావేశానికి హాజరు కావాలన్నారు.సమావేశానికి గైర్హాజరు అయితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఈ సమావేశంలో ఆర్డిఓ సూర్యనారాయణ,నీలు సువర్ణ రేఖ,సతీష్ ,తాసిల్దార్ సాయి గౌడ్,ఎంఈఓ సలీం షరీఫ్,ఏఈ హర్ష తదితరులు పాల్గొన్నారు.