పశువైద్యశాలలో వనమహోత్సవం
కోదాడ,ఆగష్టు 05(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పట్టణంలోని ప్రాంతీయ పశువైద్యశాలలో వనమహోత్సవం పురస్కరించుకుని మామిడి,ఏగీస,జిట్రేగి మొక్కలు నాటించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య.ప్రాంతీయ పశువైద్యశాల ప్రాంగణం హరితమయంతో, వైద్యంకోసం వచ్చే పశుపోషకులకు పశువులకు నీడ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటుకై మొక్కలు నాటామన్నారు.కోదాడ పరిసర గ్రామాల పశుపోషకుల ఉపయోగార్ధం 75% శాతం సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు ఎస్సీ,ఎస్టీ కేటగిరీ రైతులకోసం అందుబాటులో ఉన్నాయని భూమి పశువులు ఉన్న రైతులు మేలైన పశుగ్రాసం కొరకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమములో ప్రాంతీయ పశువైద్యశాల సిబ్బంది రాజు,ప్రశాంత్,చంద్రకళ,రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.