మొక్కలు నాటి వాటిని సంరక్షించండి:ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
కోదాడ,ఆగష్టు 05(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తేది;05.08.2024 నుండి తేది:09.08.2024 వరకు స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం కింద ప్రతిరోజు ప్రతి వార్డులో షెడ్యూల్డ్ ప్రకారంగా కార్యక్రమం చేపట్టవలసినదిగా ఆదేశించియున్నారు.దీనిలో భాగంగా ఈరోజు స్వచ్ఛదనం- పచ్చదనంపై ర్యాలీని ఉదయం 10.00 గంటలకు పురపాలక సంఘ కార్యాలయం నుండి ఎమ్మెల్యే ఎన్ పద్మావతి రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడమైనది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల యొక్క ఆరోగ్యం కాపాడుకోనే విషయంలో,సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా చేపట్టవలసిన ముందస్తు చర్యల గురించి,కుక్కల కాటుల నుండి ప్రజలను కాపాడుట,వాటికి స్టెర్లైజేషన్ చేయుట,ప్లాస్టిక్ నిషేధము,చెట్లు నాటుట,సీజనల్ వ్యాధులు డెంగ్యూ,మలేరియా వంటి వ్యాధులు సంక్రమించకుండా ముందస్తు చర్యలు చేపట్టుట,ఫీవర్ సర్వే నిర్వహించుట వంటి కార్యక్రమాలను వార్డుల వారిగా చేపట్టడం జరుగుతుందని తెలిపినారు.ఈ ఐదు రోజులు చేపట్టు కార్యక్రమములపై ప్రజలకు అవగాహన కలిగించు నిమిత్తం ర్యాలీని నిర్వహించడం జరిగినదని తెలియజేసినారు.
ప్రజలు కూడా ఇట్టి కార్యక్రమంలో భాగస్వాములై తమ వంతు పాత్రను నిర్వహించవలసినదిగా కోరినారు.తదుపరి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వద్ద గల ప్రకృతి వనంలో వనమహోత్సవం కార్యక్రమం కింద చెట్లు నాటడం జరిగినది.ఈ సందర్భంగా నాటిన ప్రతి చెట్టును బతికించు క్రమములో సంరక్షణ చర్యలు చేపట్టవలసినదిగా,మొక్కలకు నీరు పోయుట,పాదులు తీయుట వంటి కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేయవలసినదిగా,ఓపెన్ ప్లేస్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయవలసినదిగా కమీషనర్ కి ఆదేశములు జారీ చేసినారు.ఇట్టి కార్యక్రమంలో ఆర్డిఓ సూర్యనారాయణ,కమీషనర్ అంబటి రమాదేవి,చైర్ పర్సన్ సామినేని ప్రమీల,టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు,కౌన్సిలర్లు,కో ఆప్షన్ సభ్యులు,పలువురు రాజకీయ నాయకులు,కళాశాల విద్యార్థులు,పాఠశాల విద్యార్థులు,మెప్మా రిసోర్స్ పర్సన్స్,పారిశుద్ధ్య జవాన్లు,పారిశుద్ధ్య సిబ్బంది,అన్ని విభాగాల అధిపతులు,కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొనినారు.