ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ రూపకర్త జయంతి వేడుకలు
కోదాడ,ఆగష్టు 06(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ రూపకర్త కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా కోదాడ పట్టణంలో జాతీయ రహదారిపై జయశంకర్ సార్ విగ్రహం వద్ద స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మార్కండేయ మాట్లాడుతూ జయశంకర్ సార్ ఉద్యమస్ఫూర్తిని,విద్యార్థుల ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తు తెలంగాణ అభివృద్ధిలో విద్యార్థులు ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఇట్టి కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.