Monday, December 23, 2024
[t4b-ticker]

కాంస్య పోరుకు భారత్

- Advertisment -spot_img

కాంస్య పోరుకు భారత్

  • సెమీస్ లో జర్మనీ చేతిలో ఓటమి
  • పోరాడి ఓడిన టీమ్ ఇండియా

పారిస్,ఆగష్టు 07(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్లో వరుస విజయాలతో దుమ్మురేపిన భారత్ కీలక పోరులో తడబడింది.సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ పసిడి పోరుకు అర్హత సాధిస్తునుకున్న టీన్ఇండియా సెమీఫైనల్ పోరులో నిరాశపరిచింది.మంగళవారం ఆఖరి నిమిషం వరకు హోరాహోరీగా సాగిన పోరులో భారత్ 2-3 తేడాతో జర్మనీ చేతిలో పోరాడి ఓడింది.మ్యాచ్ ఆద్యంతం ఇరు జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగింది.గత(టోక్యో)ఒలంపిక్స్ లో తమకు ఎదురైన ఓటమికి పారిస్ లో భారత్ పై ప్రతీకారం తీర్చుకున్నారు.మ్యాచ్ మొదలైన తొలి రెండు నిమిషాల్లోనే టీమిండియాకు రెండు పెనాల్టీ కార్నర్లు లభించాయి.భారత్ తరఫున కెప్టెన్ హర్మన్ ప్రీత్సాంగ్(7ని),సుఖ్ త్సాంగ్(360) గోల్స్ చేశారు.మరోవైపు గొంజాలో పిలియట్(180),క్రిస్టోఫర్ రర్(27ని),మార్కో మిల్టక్ (54ని) జర్మనీకి గోల్స్ అందించారు.మ్యాచ్ విషయానికొస్తే తొలి క్వార్టర్ ఏడో నిమిషంలో దక్కిన పెనాల్టీ కార్నర్ను హర్మన్ ప్రీత్సింగ్ అద్భుత రీతిలో గోల్ గా మలువడంతో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.అయితే రెండో క్వార్టర్ మొదట్లోనే పిలియట్.. పెనాల్టీ కార్నర్ గోల్తో స్కోరు 1-1తో సమమైంది.మరో తొమ్మిది నిమిషాల తేడాతో క్రిస్టోఫర్ గోల్ చేయడంతో జర్మనీకి 2-1 ఆధిక్యం దక్కింది.మ్యాచ్ పట్టు కోల్పోతున్న సమయంలో సుఖ్ జీత్ సింగ్ గోల్తో భారత్ పోటీలోకి వచ్చింది.సమంగా సాగుతున్న మ్యాచ్ మరో ఆరు నిమిషాల్లో ముగుస్తుందనగా మార్కో ఫీల్ గోల్స్తో జర్మనీ మ్యాచ్ను తమ వైపునకు తిప్పుకుంది.ఆఖరి క్షణంలో భారత్ కు గోల్ చేసే అవకాశం వచ్చినా.. తృటిలో చేజారిపోయింది.గురువారం భారత్,స్పెయిన్ మధ్య కాంస్య పోరు జరుగనుండగా,పసిడి కోసం నెదర్లాండ్స్,జర్మనీ తలపడనున్నాయి.2 జర్మనీతో సెమీస్ మ్యాచ్ లో భారత్ కు మొత్తం 12 పెనాల్టీ కార్నర్ అవకాశాలు దక్కితే కేవలం రెండింటిని మాత్రమే గోల్స్ గా మలిచింది.మరోవైపు జర్మనీ ఏడింటిలో ఒకటి గోల్ చేసింది.8 సెమీస్ మ్యాచ్లో భారత్ 48 శాతం బంతిని తమ ఆధీనంలో ఉంచుకుంటే.. 52 శాతం జర్మనీ ఖాతాలో వేసుకుంది.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular