తృట్టిలో తప్పిన ప్రమాదం
:గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురికి తీవ్ర గాయాలు.
:ఆసుపత్రికి తరలింపు.
Mbmtelugunews/కోదాడ, ఆగష్టు 07(ప్రతినిధి మాతంగి సురేష్):ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలిన సంఘటన చిలుకూరు మండల పరిధిలోని పాత కొండాపురం గ్రామంలో చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…..పాత కొండాపురం గ్రామంలో ఉదయాన్నే వంట చేసే క్రమంలో గ్యాస్ సిలిండర్ లీక్ అయి ప్రమాదం జరిగిందని తెలిపారు.ఈ ప్రమాదంలో మేరిగ గురవయ్య,కొడుకు అరుణ్ గోపాల్, కోడలు శిరీషాకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు క్షతగాత్రులను,కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో వారికి డాక్టర్లు వైద్య సేవలు అందిస్తున్నారు.పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.