న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలి
:న్యాయవాద దంపతుల పై దాడికి నిరసనగా విధుల బహిష్కరణ:కోదాడ బార్ అసోసియేషన్
కోదాడ,ఆగష్టు 07(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:స్థానిక కోదాడ పట్టణంలో గల కోర్టు ఆవరణంలో న్యాయవాద దంపతులపై జరిగిన దాడిని ఖండిస్తూ రెండవరోజు
జనగామ జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్ కు ఒక కేసు విషయంలో వెళ్లిన న్యాయవాద దంపతులైన అమృతారావు కవితలపై అక్కడ సీఐ తన సిబ్బందితో కలిసి దురుసుగా ప్రవర్తించి వారిపై చేయి చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ రెండవ రోజు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి న్యాయస్థానం ముందు నిరసన తెలిపారు.ఈ సందర్భంగా బార్ అధ్యక్షులు ఎస్ఆర్ కే మూర్తి,సీనియర్ న్యాయవాది ఉసిరికాయల రవికుమార్ లు మాట్లాడుతూ ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా న్యాయవాదులపై భౌతిక దాడులు పెరిగిపోయాయని ఒక ప్రక్క పోలీసులు మరొకపక్క కేసులను వాదిస్తున్న వారి ప్రత్యర్థి వర్గం వారు న్యాయవాదులపై కక్షగట్టి మానసిక శారీరక హింసలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.బాధ్యత కలిగిన పోలీసు అధికారిగా న్యాయవాద దంపతులకు తగిన సమాచారాన్ని ఇచ్చి వారిపట్ల చట్టపరంగా మర్యాదగా ప్రవర్తించవలసిన పోలీసులు మహిళా న్యాయవాది అని కూడా చూడకుండా ఆమెపై కూడా దాడికి పాల్పడడం అత్యంత దారుణం అన్నారు.ఆ ఘటనలో పాల్గొన్న పోలీస్ అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటుగా వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుని వారిని విధుల నుండి సస్పెండ్ చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు.అలాగే న్యాయవాదుల రక్షణ కొరకు న్యాయవాద రక్షణ చట్టాన్ని తక్షణమే రూపొందించి అమలు చేయాలని వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.లేనట్లయితే దేశవ్యాప్తంగా తమ హక్కుల సాధన కొరకు న్యాయవాదులు ఉద్యమించడం ఖాయమని వారు హెచ్చరించారు.అదేవిధంగా కర్ణాటక రాష్ట్ర న్యాయ మరియు పార్లమెంటు వ్యవహారాల మంత్రి హెచ్ కె పాటిల్ కర్ణాటక న్యాయవాదులపై హింస,నిషేధ బిల్లు 2023ని డిసెంబర్ 2023లో ఆమోదించారు.దీనికి 2024 మార్చ్ 20న గవర్నర్ ఆమోదం పొందినదని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ ఆర్ కె మూర్తి,ఉపాధ్యక్షులు గట్ల నర్సింహారావు,ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల రామిరెడ్డి,బార్ అసోసియేషన్ సభ్యులు కోడూరు వెంకటేశ్వరరావు,మంద వెంకటేశ్వర్లు,దొడ్డ శ్రీధర్,ఎస్ కే నాగులపాషా,నవీన్,హేమలత,ధనలక్ష్మి,సీనియర్ న్యాయవాదులు వీ రంగారావు,సిలివేరి వెంకటేశ్వర్లు,పాలేటి నాగేశ్వరరావు,ఈదుల కృష్ణయ్య,శాస్త్రి,సాదు శరత్ బాబు,అబ్దుల్ రహీం,ఉసిరికాయ రవికుమార్,ఎడ్లపల్లి వెంకటేశ్వర్లు ,నజీర్,ఉయ్యాల నరసయ్య, దావీదు,రియాజ్,నాగుల్ మీరా, వెంకటాచలం,కొండ భీమయ్య,మురళి,శరత్,శ్రీనివాస్,న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.