వీది కుక్కల తో ప్రజలు జాగ్రత్త వహించాలి:డా,, పి పెంటయ్య
కోదాడ,ఆగష్టు 07(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఈ మధ్య తరచుగా వింటున్న విషయం వీది కుక్కల తో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని పరిగణించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమములో వీది కుక్కల నియంత్రణ యాజమాన్యంపై ప్రత్యేక కార్యక్రమాన్ని తేదీ:08-08-24 నా నిర్వహిస్తుందనని అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ డా,,పి పెంటయ్య అన్నారు.దీనిలో భాగంగా రేపు అనగా గురువారం కోదాడ పట్టణంలో మున్సిపాలిటీ సహకారంతో వీది కుక్కలు,పెంపుడు కుక్కల సర్వే నిర్వహించబడును.ఇట్టి కార్యక్రమములో పట్టణ పెద్దలు,ప్రజలు సహకరించి సంపూర్ణ కుక్కల లెక్కలకు సహకరించబలసినదిగా విజ్ఞప్తి చేయనైనది.రేబిస్ వ్యాధినిరోధక టీకాలు వేయించని కుక్కలకు రేపు అనగా గురువారం ప్రాంతీయ పశువైద్యశాలలో ఉచితంగా రేబిస్ నివారణ టీకాలు వేయబడును.కుక్కల నుండి రక్షణ కొరకు పట్టణ ప్రజలకు డాక్టర్ పి పెంటయ్య ఈ క్రింది సూచనలు చేయనైనది
1.కుక్కను చెయినుతో కట్టినా,తీగల బోనులో ఉంచినా సరే దానికి దగ్గరగా వెళ్లరాదు,నడవరాదు.
2.నడుచుకుంటూ వెళ్లే సమయములో కుక్క మీదకు వస్తే,పరుగెత్తరాదు,కదలకుండా రాయిలాగా చేతులు బాడీకి ఆనించి నిలబడాలి.ఆ సమయములో కుక్క దగ్గరకు వచ్చి వాసన చూసి వెళ్లిపోతుంది.
3.కుక్క కళ్ళల్లోకి సూటిగా చూడరాదు.
4.కుక్క ఎదురుగా ఉన్నప్పుడు చూపు నేలవైపు ఉండాలి
5.కుక్కలు అన్నం తినేటప్పుడు,పడుకున్నప్పుడు,పిల్లలతో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయరాదు.
6.పిల్లల తల్లి కుక్క వద్దకు అసలు వెళ్లరాదు.
7.కుక్క కరవడానికి వస్తే విధిలేని పక్షంలో బంతిలాగా ముడుచుకుని పడుకోవాలి,చేతులు వెనుకనుండి తలను కప్పి ఉంచి తలకు గాట్లు పడకుండా రక్షించులోవాలి.
8.అనుకోని పరిస్థితుల్లో కుక్క కారిస్తే గాయాన్ని ధారగా కారే నీటి టాప్ కింద పెట్టి శుభ్రపరచుకోవాలి.
9.గాయం పైన గట్టిగా అదిమి పట్టుకోవాలి.
10.వైద్యులను సంప్రదించి గాయాలకు చికిత్సతో పాటు,రేబీస్ నివారణ టీకా వేయించాలి.పట్టణంలో వీది కుక్కల నియంత్రణకు మున్సిపాలిటీ వారి సహకారంతో నిపుణులతో కుక్కలను పట్టించి జిల్లా కేంద్రంలోని కుక్కల పునరావాస కేంద్రంలో చేర్చి జనాభా నియంత్రణకు కుటుంబనియంత్రణ ఆపరేషన్లు చేయించి రేబిస్ నివారణ టీకాలు వేయించబడును.కోదాడ పట్టణంలో వీది కుక్కల నియంత్రణకు పట్టణ ప్తజలు సహకరించవలసినదిగా కోరనైనది.