సుంకిశాల ప్రాజెక్ట్ సందర్శనకు బయలుదేరిన మంత్రులకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 09 ప్రతినిధి మాతంగి సురేష్:సుంకిశాల ప్రాజెక్ట్ సందర్శనలో భాగంగా హైద్రాబాద్ నుండి కోదాడ వచ్చిన రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి.నాగార్జున సాగర్ సుంకిశాల ప్రాజెక్ట్ సందర్శనలో భాగంగా హైదరాబాద్ నుండి రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తో కలిసి రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ బైపాస్ లోని కట్టకొమ్ముగూడెం రోడ్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ అయినారు.
అక్కడ వీరికి స్థానిక శాసన సభ్యులు నల్లమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వారికి స్వాగతం పలికారు.ఖమ్మం నుండి వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ని హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ లో అక్కడ నుండి నాగార్జున సాగర్ సుంకిశాల ప్రాజెక్ట్ పరిశీలనకు కు హెలికాప్టర్ ద్వారా బయలుదేరినారు.ఈ కార్యక్రమం లో ఆర్డిఓ సూర్యనారాయణ,డిఎస్పి శ్రీధర్ రెడ్డి,తహసీల్దార్ సాయగౌడ్,సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.