Monday, December 23, 2024
[t4b-ticker]

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో-ఎన్టీఆర్ సినిమా షురూ..

- Advertisment -spot_img

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో-ఎన్టీఆర్ సినిమా షురూ..

Mbmtelugunews//సినిమా,ఆగష్టు 10 ప్రతినిధి మాతంగి సురేష్:స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్,హీరో ఎన్టీఆర్ సినిమా మొదలైంది.శుక్రవారం పూజా కార్యక్రమాలతో దీన్ని ప్రారంభించారు.రామానాయుడు స్టూడియోస్ లో ఈ వేడుక ఘనంగా జరిగింది.ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్ ఇరు కుటుంబసభ్యులు దీనికి హాజరయ్యారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను అభిమానులు షేర్ చేస్తున్నారు.ఇక ఈ చిత్రం ప్రారంభం సందర్భంగా సోషల్ మీడియాలో ‘ఎన్టీఆర్ నీల్’ హ్యష్యాగ్ వైరల్ గా మారింది. 2026 జనవరి 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు చిత్రబృందం తెలిపింది.’కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో జోష్ మీదున్న ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ ని ఎలా చూపిస్తారా అని ఆయన ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.దీని కథ గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ..”దీన్ని అందరూ ఓ యాక్షన్ సినిమాలా భావిస్తారని నాకు తెలుసు.కానీ,నేను నా జానర్లోకి వెళ్లాలనుకోవట్లేదు.నిజానికిది భిన్నమైన భావోద్వేగాలతో కూడిన వైవిధ్యభరిత చిత్రంగా ఉంటుంది.ఇది నాకు చాలా కొత్త కథ అని చెప్పగలను”అని వెల్లడించారు.దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇటీవల ఈ సినిమా టైటిల్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.’ఎన్టీఆర్ 31’వర్కింగ్ టైటిల్ తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ‘డ్రాగన్’ పేరు ఖరారు చేసినట్లు వార్తలు వినిపించాయి.ఈ పేరుతో కొన్ని పోస్టర్లు ఎక్స్ లో దర్శనమిచ్చాయి.ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా తెరకెక్కించాలని భావిస్తున్నట్లు సమాచారం.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular