కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ ని కలిసిన పంచాయతీరాజ్ ఛాంబర్,సర్పంచ్ల సంఘం రాష్ట్ర కమిటి నాయకులు.
Mbmtelugunews//నేషనల్, ఆగష్టు 11 ప్రతినిధి మాతంగి సురేష్:ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ నాయకత్వంలో పంచాయతీరాజ్ చాంబర్ మరియు సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ ఈరోజు గుంటూరు నగరంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కార్యాలయంలో వారిని కలిసి నూతనంగా పదవి బాధ్యతలు తీసుకున్నందుకు అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది .
👉ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఈరోజు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మా పంచాయతీ రాజ్ చాంబర్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీతో దాదాపు గంటసేపు సమావేశమై రాష్ట్రంలోని 12, 918 గ్రామ పంచాయతీలలో నివసిస్తున్న మూడున్నర కోట్ల గ్రామీణ ప్రజల యొక్క సమస్యలను మరియు వాటి పరిష్కారం కొరకు సలహాలు సూచనలు కోరడం జరిగింది.
👉అందులో భాగంగాకేంద్ర ప్రభుత్వం 14,15 వ ఆర్థిక సంఘాల సిఫారసుల మేరకు మన ఆంధ్రప్రదేశ్ లోని గ్రామపంచాయతీలకు,మండల పరిషత్లకు,జిల్లా పరిషత్లకు వరుసగా ఐదు సంవత్సరాలలో 10,441.51 కోట్లు పంపించడం జరిగింది.కానీ అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మా గ్రామ పంచాయతీలకు,మండల పరిషత్లకు,జిల్లా పరిషత్తులకు ఆ నిధులు ఇవ్వకుండా దొంగిలించి దారి మళ్లించి తన సొంత పథకాలకు సొంత అవసరాలకు వాడేసుకుని మా సర్పంచ్లకు,ఎంపీటీసీలకు,జడ్పిటిసి లకు తీరని అన్యాయం చేసినదని వివరించడం జరిగింది.
👉కనుక దొంగలించబడ్డ 10,441.51 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం నుండి తిరిగి మాకు ఇప్పించవలసిందిగా కోరడమైనది.
👉 16వ ఆర్థిక సంఘం నిధులను 50:25:25 నిష్పత్తిలో పంపించవలసినదిగా 16వ ఆర్థిక సంఘం చైర్మన్,సభ్యులకు తమరు సిఫారసు చేసి మా ఎంపీటీసీలకు జడ్పీటీసీలకు కూడా తగిన న్యాయం చేయవలసినదిగా మంత్రిని కోరడమైనది.
👉ఉపాధి హామీ నిధులను 90%=10% రేషియోలో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసుకోవడానికి అవకాశం కల్పించవలసిందిగా కోరడమైనది.
👉ఉపాధి హామీ కూలీలను గ్రామపంచాయతీకి అనుసంధానం చేసి గ్రామ పరిశుభ్రతకు అవకాశం కల్పించాలని కోరడమైనది.
👉 ఉపాధి హామీ సిబ్బందిని మండల పరిషత్,గ్రామపంచాయతీ ఆధీనంలో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడమైనది.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్ తో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి,రాష్ట్ర ఉపాధ్యక్షులు అనేపు రామకృష్ణ,గోగినేని వసుధ,చిత్తూరు జిల్లా పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు చుక్క ధనుంజయ యాదవ్,సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జల్లు కొండయ్య,రావెళ్ల సుధాకర్,అధికార ప్రతినిధి గళ్ళ తిమోతి గుంటూరు జిల్లా అధ్యక్షులు కల్లూరు శ్రీనివాస్,సర్పంచ్ల సంఘం రాష్ట్ర కార్యదర్శులు నాగేందర్ రెడ్డి,శంకర్ యాదవ్,మేదరమెట్ల శివశంకర్,హఫీజ్ బేగ్ ,రామచంద్రుడు బజాజ్ ఛాంబర్ రాష్ట్ర నాయకులు మానం విజేత,ఎలవర్తి లక్ష్మి వెంకటేష్ యాదవ్,కిరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.