నల్లబండగూడెంలో ఫీవర్ సర్వే
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 12 ప్రతినిధి మాతంగి సురేష్:అనంతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నల్లబండ గూడెం గ్రామంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న దృష్ట్యా వైద్యాధికారి ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బంది గృహ సందర్శనలు చేసి గడపగడపకు సందర్శించి జ్వరాలతో ఉన్న రోగులను గుర్తించి రక్త నమూనాలను సేకరించి చికిత్స అందించారు.అనంతరం వైద్యాధికారి డాక్టర్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యతను తెలియజేస్తూ దోమలు పుట్టకుండా,దోమలు కుట్టకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆరోగ్య విద్యను అందించారు.ఈ కార్యక్రమంలో హెచ్ఈవో ఉపేందర్,పీహెచ్ఎన్ అనంత లక్ష్మి,సూపర్వైజర్ ఉమామహేశ్వరి,యాతాకుల మధుబాబు,నరసింహ,పరమేశ్వరి,గోపమ్మ ,గ్రామ కార్యదర్శి,ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.