రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండా
:ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే
నేడు దేశమంతా రెపరెపలాడుతున్న జాతీయ జెండాకు రూపు దాల్చింది కోదాడ నియోజకవర్గంలోనే:ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
కోదాడ,ఆగష్టు 15(మనం న్యూస్) నేడు దేశం అంతా రెపరెపలాడు తున్న మువ్వన్నెల జాతీయ జెండా ను రూపు దాల్చింది కోదాడ నియోజకవర్గంలోనే ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతి ఒక్కరూ ఒక పండుగలా జరుపుకోవాలని నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు.78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కోదాడ నియోజకవర్గ పరిధిలోనే పలు కార్యాలయాలలో వ్యవసాయ మార్కెట్ కమిటీ,సంత అడ్డాలో, మున్సిపాలిటీలో, గ్రంథాలయంలో,గాంధీ పార్కులో,మహిళా మండలి లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో,ఎంపీడీవో,ఆర్డీవో,ఎంఆర్ఓ కార్యాలయాలలో జెండాను ఎగరవేసిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాడు మహనీయుల త్యాగాల ఫలితంగానే నేడు స్వేచ్ఛగా జీవిస్తున్నామని వారి ఆశయాల సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.
నేడు దేశమంతా పండగలా జరుపుకుంటున్న జాతీయ జెండా రూపు దాల్చిన కోదాడ నియోజకవర్గంలో మనం ఉండడం మనకు ఎంతో గర్వకారణం అని అన్నారు.దేశ సరిహద్దులలో వారి ప్రాణాల సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ డెలిగేటు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి,మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్,వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు,మున్సిపల్ కమిషనర్ అంబటి రమాదేవి,ఆర్డిఓ సూర్యనారాయణ,ఎంపీడీవో వివి రామచంద్రరావు,ఎమ్మార్వో సాయి గౌడ్,ఎర్నేని బాబు,పార సీతయ్య,పంది తిరుపతయ్య,గంధం పాండు,నిరంజన్ రెడ్డి,దండా వీరభద్రం,అల్తాఫ్ హుస్సేన్,సిపిఎం ముత్యాలు,బొలిశెట్టి కృష్ణయ్య, మేకల శ్రీనివాసరావు,చందర్ రావు,దేవమణి,సులోచన తదితరులు పాల్గొన్నారు.