జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ ఉద్యమకారుడు రాయపూడి వెంకటనారాయణ
Mbmtelugunews//కోదాడ,ఆగస్టు 15 ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ పట్టణంలోని కరూర్ వైశ్యా బ్యాంక్ సెంటర్ వద్ద ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా యూనియన్ నాయకులతో కలిసి తెలంగాణ ఉద్యమకారుడు రాయపూడి వెంకటనారాయణ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి జెండాకు వందనం సమర్పించారు.ఈ సందర్భంగా రాయపూడి మాట్లాడుతూ అనేక మహనీయుల త్యాగాల ఫలితంగా నేడు మనకు స్వాతంత్రం లభించింది అన్నారు.వీరమరణం పొందిన యోధుల ఆత్మకు శాంతి కలగాలని,రాబోయే రోజుల్లో తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఆటో యూనియన్ సభ్యులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సలీం,సాగర్,శీను,ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.