ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
Mbmtelugunews//ఆగస్టు 15 ప్రతినిధి మాతంగి సురేష్:చిలుకూరు మండలంలోని అన్ని గ్రామాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు.తహసీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ ధ్రువ కుమార్,మండల పరిషత్ లో మండల ప్రత్యేక అధికారి రామచంద్ర రావు,గ్రామపంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో గిరిబాబు,పోలీస్ స్టేషన్ లో ఎస్సై సురభి రాంబాబు గౌడ్,పిఎసిఎస్ లో ఛైర్మన్ అలసకాని జనార్ధన్,ప్రెస్ క్లబ్ లో అధ్యక్షులు మల్లం వెంకటేశ్వర్లు,పశు వైద్య కేంద్రంలో పశు వైద్యులు వీరారెడ్డి,గ్రంథాలయంలో అధికారి నరసయ్య,వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో పాఠశాలలో సంబంధిత అధికారులు జెండాలను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బోలిశెట్టి నాగేంద్రబాబు,వివిధ శాఖల అధికారులు,ప్రజాప్రతినిధులు,ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.