Monday, December 23, 2024
[t4b-ticker]

ప్రభుత్వ సంస్థల్లో అక్రమంగా కొనసాగుతున్న 1050 మంది రిటైర్డ్ ఉద్యోగస్తులను వెంటనే తొలగించాలి:యన్ యమ్ శ్రీకాంత్ యాదవ్

- Advertisment -spot_img

ప్రభుత్వ సంస్థల్లో అక్రమంగా కొనసాగుతున్న 1050 మంది రిటైర్డ్ ఉద్యోగస్తులను వెంటనే తొలగించాలి:యన్ యమ్ శ్రీకాంత్ యాదవ్

Mbmtelugunews//తెలంగాణ,ఆగష్టు 16 ప్రతినిధి మాతంగి సురేష్:గతపది సంవత్సరాలుగా దాదాపు 1050 మంది రిటైర్డ్ ఉద్యోగస్తులు ప్రభుత్వంలో ఉన్న శాఖల్లో ఉన్నత పదవుల్లో డిపార్ట్మెంట్ హెడ్లు గా,ఇతర ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్నారని తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ టియస్ఏ రాష్ట్ర అధ్యక్షులు యన్ యమ్ శ్రీకాంత్ యాదవ్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిటైర్డ్ అయినవారు విధులలో కొనసాగడం వలన వీరికి అలవెన్స్ లు, ఇతరత్రా వాటికి దాదాపు సంవత్సరానికి 150 కోట్లు ప్రజాధనం కేటాయించాల్సి వస్తుందని అన్నారు.అర్హులైన సీనియర్ ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కకుండానే రిటైర్ అవ్వాల్సిన దుస్థితి,నిరుద్యోగులకు కూడా నష్టం జరుగుతుందని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షం లో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే ఈ రిటైర్డ్ ఉద్యోగులను వెంటనే తొలగించి సీనియర్ ఉద్యోగులకు ప్రమోషన్ కల్పించి తద్వారా ఏర్పడిన ఖాళీలను నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది.దాదాపు ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు పూర్తి అయినా కూడా నేటికి అమలుకు నోచుకోలేదు ఒకవైపు నిరుద్యోగ సమస్య రోజురోజుకి పెరిగిపోతుంది రిటైర్డ్ ఉద్యోగులు మాత్రం పెన్షన్ తో పాటు అక్రమంగా జీతాలు,అలవెన్స్ లు పొందుతున్నారు.దీనిపై ముఖ్యమంత్రి స్పందించి వెంటనే వారిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం.లేని యెడల నిరుద్యోగులను,ఉద్యోగులను కలుపుకొని మరో ఉద్యమానికి శ్రీకారం చూడతామని హెచ్చరిస్తూ ప్రభుత్వం స్పందించకపోతే సెక్రటేరియట్ ముట్టడిస్తాం అని హెచ్చరిస్తున్నాం.ఈ కార్యక్రమం లో టిఎస్ఏ నాయకులు రామ్ కిషన్,మురళి కృష్ణ,రంజిత్ వర్మ,కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular