ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్న శ్రీధర్ రెడ్డికి ఘన సన్మానం.
:విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో డీఎస్పీకి ఘన సన్మానం:విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య.
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 17:విధి నిర్వహణలో ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించిన ప్రతి ఉద్యోగికి ఎల్లవేళలా గుర్తింపు లభిస్తుందని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల. సీతారామయ్య అన్నారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ఇండియన్ పోలీస్ మేడల్ అందుకున్న సందర్భంగా శనివారం వారిని సంఘ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి భారత ప్రభుత్వం తరఫున విదేశాల్లో సైతం పనిచేశారని వారు ఎక్కడ పనిచేసిన విధి నిర్వహణలో అంకితభావంతో ప్రజలకు సేవలు అందిస్తారని ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు.భవిష్యత్తులో వారికి మరెన్నో అవార్డులు రావాలని ఆకాంక్షించారు.విధి నిర్వహణతో పాటు సామాజిక సేవలో సైతం డీఎస్పీ శ్రీధర్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి,బొల్లు రాంబాబు,గడ్డం నరసయ్య,లక్ష్మీకాంత్ రెడ్డి,పొట్ట జగన్మోహన్ రావు,పోటు రంగారావు,బిక్షం,భ్రమరాంబ,జాఫర్,రుక్ముద్దీన్,హరిబాబు,సాంబులు తదితరులు పాల్గొన్నారు.