బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్వాయి పాపన్న.
:బలహీన వర్గాలకు రాజ్యాధికారం కోసం పోరాడిన మహనీయుడు.
జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్.
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 18 ప్రతినిధి మాతంగి సురేష్:బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్వాయి పాపన్న అని జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ అన్నారు.సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా కోదాడ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఆయన చిత్రపటానికి గౌడ కులస్తులు,పట్టణ ప్రముఖులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.నిరంతరం రాజరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి గోల్కొండ కోటను జయించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన మహా వీరుడని అణగారిన వర్గాలన్నింటిని కూడగట్టి మహా సైన్యాన్ని ఏర్పాటుచేసి రాచరిక వ్యవస్థ రద్దుకోసం కృషిచేసిన యోధుడని అన్నారు.వారి ఆశయాల సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు.ఈ కార్యక్రమంలో డిసిసిబి జిల్లా డైరెక్టర్ కొండా సైదయ్య గౌడ్,న్యాయవాది ఉయ్యాల నరసయ్య గౌడ్,నియోజకవర్గ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు మరికంటి లక్ష్మణ్ గౌడ్,వేదశ్రీ వెంకటేశ్వర్లు గౌడ్,పోలంపల్లి వెంకటేశ్వర్లు గౌడ్,మైత్రి మండవ మధు,ఉద్యోగ సంఘం నాయకులు కొండా వెంకటేశ్వర్లు గౌడ్,కోసూరు బద్రి గౌడ్,వీరంకి నాగేంద్రబాబు గౌడ్,గాలి శ్రీనివాస్ గౌడ్,కారింగుల అరవింద్ గౌడ్,సైదులు గౌడ్,పగిడిపత్తి రామచంద్ర గౌడ్,సంపేట నరేష్ గౌడ్,కేశగాని రమేష్ గౌడ్,కాసాని మల్లయ్య గౌడ్,మట్టపల్లి సాలయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.