కోదాడ పట్టణంలో ఘనంగా బోనాల పండుగ.
:వైభవంగా శ్రావణమాస బోనాలు.
Mbmtelugunews// కోదాడ,ఆగష్టు 18:సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను కోదాడ పట్టణ వాసులు ఆదివారం ఘనంగా నిర్వహించారు.మహిళలు పెద్ద ఎత్తున తలపై బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా తరలి వెళ్లి ముత్యాలమ్మ తల్లి ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి నైవేద్యం,చీరలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు.
ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులతో వర్షాలు బాగా కురిసి చెరువులు నిండి పాడిపంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులను కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు.అమ్మవారిని కోదాడ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల రమేష్,పీసీసీ డెలిగేట్ సభ్యులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ రమాదేవి,స్థానిక కౌన్సిలర్ షాబుద్దీన్,పుర ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.